Monday, 15 August 2011

shall we espect ?

గాంధీజీ ఇలా అన్నారు "సమాజంలో అట్టడుగువాడే మొట్ట మొదట లబ్ది పొందాలి". 65 సంవస్తరాల భారతావని లో వికలాంగులు ఎటువంటి లబ్ది పొందుతున్నారో ఆలోచించండి "మేం ఎంతమందో మాకు అంత వాటా" అన్నది నేడు అత్యంత ప్రాచుర్యం పొందిన నినాదం . మరి మన దేశం లో వికలాంగులకు అలాంటి న్యాయమైన వాటా ఉదా ? లేదు .అందుకే ఇప్పుడు కచ్చితంగా ఇవ్వాలి మరియు కావాలి . చరిత్ర అంతటా వికలాంగులు సామజిక రక్షణ పొందవలసిన వ్యక్తులుగా చుడబడ్డారు .వారి పట్ల జాలి చూపాలి కానీ గౌరవం కాదన్నారు .అభివ్రిడ్ది చెందుతున్న నాగరిక ప్రపంచంలో ఇలాంటి భావన ఎంత మాత్రం సరి కాదు .ప్రస్తుత సమాజం లో వికలాంగులు విస్తృతమైన అనుభవం నైపుణ్యం ,చక చాక్యాలు కలిగి ఉన్నారు . భారతదేశంలో మొత్తం జనాభాలో సుమారు 2 .1 నుండి 2 .5 శాతం వరకు వికలాంగులు ఉన్నట్లు అంచనా .భారతదేశం లో చాల రాష్ట్రాల జనాభా ఈ శాతం కన్నా తక్కువ .మరి సంక్యను బట్టి సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్న మన దేశంలో వికలాంగులకు తగినన్ని నిధుల కేటాయింపులు జరగటంలేదన్నది అక్షర సత్యం. 1881 నుండి 1931 వరకు జరిగిన జనగణన లో వికలాంగుల జన గణన సరిగ్గా జరగలేదు .స్వాతంత్ర్యం వచ్చిన ౩౩ సంవత్సరాలకు 1981 లో మొదటిసారిగా వికలాంగుల జనగణన జరిగింది .అది కుడా ఐక్యరాజ్య సమితి 1981 సం ని అంతరాజాతియ వికలాంగుల సంవత్సరం గా ప్రకటిమ్చతంవలన మాత్రమే. 1996 సం ఫిబ్రవరి 7 నుండి మన దేశంలో అమలిలోనికి వచ్చిన వికలాంగుల చట్టం 1995 ప్రభావం వలన 2001 లో వికలాంగుల జనగణన జరిగింది .దీని ప్రకారం మనదేశంలో 2 .19 కోట్ల మంది ఉన్నారు అని అంచనా .మరోవైపు అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలలో వికలాంగులు 10 శాతం ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో స్పష్టం చేస్తుంది . ఇటువంటి పరిస్థితులలో గాంధీజీ ఆశయం నెరవేరాలంటే 2011 జనగణన ప్రకారం వికలాంగుల జనాభా ప్రాతిపదికన న్యాయమైన సహేతుకమైన వాటా అన్నింటా ఇవ్వాలి .వికలాంగులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్తితిలపట్ల శ్రద్ధ చూపిస్తూ జాతి ,రంగు,లింగ ,భాష ,ప్రాంత ,కుల ,మతాలకు అతీతంగా ,పౌర ,రాజకీయ ,ఆర్దిక ,సామజిక ,సంస్కృతిక రంగాలలో సమాన అవకాసం కల్పిచాలి

No comments:

Post a Comment